ఎల్బీనగర్ లో యువ ఆత్మీయ సమ్మేళనం
ఎల్బీనగర్ లో ఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయాన్ని త్వరలో ప్రకటిస్తాం
: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్
వనస్థలిపురం, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ నియోజకవర్గం యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్,
మల్లికార్జున భక్త సమాజం స్టేట్ ప్రెసిడెంట్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలిసిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తాము ఎవరికి మద్దతు ఇచ్చే విషయాన్ని ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సంఘం ప్రెసిడెంట్ జగన్మోహన్, రజక రాష్ట్ర నాయకులు వెంకటేష్, లంబాడీల పొలిటికల్ జేఏసీ మల్లేష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి వైస్ ప్రెసిడెంట్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మురళి నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి వైస్ ప్రెసిడెంట్ బన్సీలాల్, ఎల్బీనగర్ నియోజకవర్గం బీసీ యూత్ ప్రెసిడెంట్ దర్పల్లి కమలాకర్, గ్రేటర్ బిసి వైస్ ప్రెసిడెంట్ శివయాదవ్, శ్రీ మల్లికార్జున సేవా సమితి అధ్యక్షులు రాజు గురుస్వామి, వెంకటేశ్వర కాలనీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్, డాక్టర్ జేఏసీ శశికుమార్ బి.ఎన్.రెడ్డి ఆటో యూనియన్ అధ్యక్షులు నర్సింగ్, రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు శివకుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు విష్ణు, కాళిదాసు, ఆంజనేయులు, ఉపేందర్, శ్యామ్ గౌడ్, నిఖిల్, నాని, సురేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.