Sunday, September 8, 2024

గుంటూరు కారం*లో మహేష్ ఘాటు.. తివ్రిక్రమ్ దే చప్పదనం*

- Advertisement -

గుంటూరు కారం*లో మహేష్ ఘాటు.. తివ్రిక్రమ్ దే చప్పదనం*

సంక్రాతి పండగొచ్చిందంటే చాలు – కోడి పందాలు – ఎడ్ల పందాలు – తో తెలుగు వాళ్ళకి నిజమైన పండగ.
ఈ సంక్రాతి బరి లోకి, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం వచ్చి, తెలుగు వాళ్ళ ఇళ్లల్లోకి, పిండివంటల్లోకి, ఏ మాత్రం కారాన్ని నింపిందో, మమ కారాన్ని పంచిందో – ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీ

నివాస్ ల కాంబో లో వచ్చిన గుంటూరు కారం కధ చాలా సింపుల్.ఎప్పుడో ఐదేళ్ల వయసులో, తల్లి వదిలేస్తే, ఆ తల్లి- లా మినిస్టర్ -వసుంధర (రమ్యకృష్ణ ) పిలుపు కోసం పాతికేళ్ళు గా ఎదురు చూసే కొడుకు – బోగినేని వెంకట రమణ అలియాస్ రమణ గాడు (మహేష్ బాబు); అకారణం గా జైలుకెళ్లి, ఒంటరిగా గదిలో కూర్చుని కిటికీ లోంచి చూసే తండ్రి – సత్యం (జయరాం);- ఈ ముగ్గురు ఎప్పుడు కలుస్తారా? అనే ఎదురుచూపుల్లో, వండిన కధే -ఈ గుంటూరు కారం.

తల్లి వదిలేసిన రమణ – మేనత్త – ఈశ్వరీ రావు దగ్గరే పెరుగుతాడు – గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు.

పాటికెళ్లుగా తల్లి పిలుపు కోసం చూసే, రమణ కి పిలుపైతే వస్తుంది కానీ, ఆ పిలుపు తన తల్లి తో సంబంధం లేదు, ఆస్థి లో హక్కు లేదు అని రాసి సంతకం తీసుకోడానికని, భయపెట్టి చెబుతాడు – ఎనభై ఏళ్ల వయసులో – తన కులపువారసుడే వాళ్లే రాజకీయ అధికారం దక్కించుకోవాలని, అందుకోసం ఏమైనా చేసే – వసుంధర తండ్రి – వెంకట స్వామీ ( ప్రకాష్ రాజ్ ).

ఈ క్రమం లో, సంతకం పెట్టకుండా ఎదురు తిరిగే ప్రాసెస్ లో, వసుంధర దగ్గర పనిచేసే లాయర్ పాణి ( మురళి శర్మ ) కూతురు అమ్ము ( శ్రీ లీల ) కి దగ్గరవుతాడు – రమణ.

అస్సలు వసుంధర తన బిడ్డ రమణ ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? తన మొదటి భర్త సత్యానికి విడాకులు ఎందుకు ఇచ్చింది? నారాయణ (రావు రమేష్ ) ని రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? ఈ రెండో పెళ్లి సీక్రెట్ ఏమిటి? వసుంధర – రమణ – సత్యం కలవకుండా చేయడానికి వెంకట స్వామి అన్ని రకాల కుతంత్రాలు చివరి వరకూ ఎందుకు చేశాడు? అసలు వసుంధర ఎందుకు ఇవ్వన్నీ చేసింది?
వీటికి ఆన్సర్స్ కావాలి అంటే – గుంటూరు కారం చూడాల్సిందే.

గుంటూరు కారం లో మదర్ సెంటిమెంట్ అనేది మెయిన్ ఎలిమెంట్.
సినిమా మొత్తం మహేష్ బాబు తన భుజాల మీద మోశాడనే చెప్పాలి.
ఒక కొత్త మహేష్ ని, మాస్ లుక్స్ లో చూస్తాము.

మహేష్ లుక్స్ అదిరిపోయాయి. డాన్స్ లు ఎక్స్ల్లెంట్ గా ఉన్నాయి.
తన డైలాగ్ డెలివరీ లో వారియేషన్స్ బాగా పలికాయి. కామెడీ టైమింగ్ బాగుంది.

అస్సలుకి – మహేష్ ఎంట్రీ చూపించిన విధానం, ఇంట్రడక్షన్ సాంగ్ అయితే నెక్ట్ లెవెల్ లో ఉంది.

తల్లీ కొడుకు ల సెంటిమెంట్ లో, తల్లి (రమ్య కృష్ణ ) పాత్ర ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు.
అలాగే రమణ తన మేనత్త ( ఈశ్వరి రావు ) ఇంట్లో పెరిగినప్పుడు – మేనత్త క్యారెక్టర్ ని కూడా ఇంకా కధ లోకి ఇన్వొల్వ్ చేయాలి.

ఎందుకంటే, కధ లో ఈ రెండు లేడీ క్యారెక్టర్స్ చాలా బలమైన వ్యకత్వం కలిగి ఉంటాయి – కానీ – ఆ క్యారెక్టరైజషన్ లో తేలి పోయాయేమో అనిపిస్తుంది.

ప్రీ క్లైమాక్స్ లో వండిన మదర్ సన్ సెంటిమెంట్ బ్యాంగ్ ఒకటి, ఇంటర్వెల్ ముందు వండి,
వార్చాల్సింది – ఎందుకంటే – ఫస్ట్ ఆఫ్ లో స్క్రిప్ట్ లో లాగ్ కనిపిస్తుంది.

జనరల్ గా త్రివిక్రమ్ సినిమా ల్లో, హీరోయిన్స్ కి ఒక
ఇండువిడ్యుయేలిటీ ఉంటుంది – సొంత ఆలోచన లు ఉంటాయి – కానీ ఇక్కడ అమ్ము ( శ్రీలీల ) క్యారెక్టర్ ఒక్క సాంగ్స్ – డాన్స్ లకి మాత్రమే వాడుకున్నట్లుంది.
శ్రీ లీల తన పాత్ర ల మీద, నటన మీద కాన్సంట్రేషన్ పెట్టక పొతే, చాలా త్వరగా ఫేడ్ అవుట్ అవుతుంది.
అలాగే, రమణ గాడి మేనత్త కూతురు – మారదలి గా మీనాక్షి చౌదరి ని, అసలు త్రివిక్రమ్ ఎందుకు తీసుకున్నాడో అర్ధం కాదు.
మహేష్ కి డ్రింక్స్ లోకి, నీళ్లు, ఆమ్లెట్లు ఇవ్వడానికి సరిపోతుంది – ఎక్కువ సీన్లు కూడా లేవు.

ఇక ఆర్టిస్తుల విషయం లోకి వస్తే, మళ్ళా, మళ్ళా, చూసేట్లు గా మహేష్ లుక్స్, డాన్స్ లు, స్క్రీన్ ప్రెసెన్స్, డైలాగ్స్, అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి.
తల్లి కోసం తల్లడిల్లే కొడుకు పాత్ర లో, మాస్ పాత్ర లో ఉండే రేంజ్ లోంచి బయటకు రాకుండా, ఒదిగి పోయాడు.
రమ్య కృష్ణ, బిడ్డ ని కాపాడే క్రమం లో, తల్లి గా పడే తపన, కొన్ని సీన్ల లో బాగా పండుంచింది.

నెక్స్ట్ చెప్పుకోవాల్సింది – ప్రకాష్ రాజ్ – చాలా బాగా చేశాడు – కాకపోతే – రంగస్థలం లోని ప్రకాష్ రాజ్ గుర్తొస్తాడు.

ఈశ్వరి రావు కూడా సగటు గుంటూరు జిల్లా మహిళ గా చాలా ఈజ్ తో చేసింది.

బలమైన క్యారెక్టర్స్ ఉన్న ఈ సినిమా లో వాళ్ళ మధ్య బాండింగ్ మిస్ అయిందేమో అనిపిస్తుంది.
జయరాం, రావు రమేష్, మురళి శర్మ, వాళ్ళ పాత్ర ల్లో బాగా చేశారు.

వెన్నెల కిషోర్, గుడ్డి వాడు గా అజయ్ చేసిన కామెడీ బానే వర్కౌట్ అయింది.

తమన్ మ్యూజిక్ లో వచ్చిన ఇంట్రడక్షన్ సాంగ్, కుర్చీ మడత పాటలు, మహేష్ మానరిజానికి సరి పోయాయి. నాక్కిలీసు గొలుసు పాట బాగుంది – (రఘు కుంచె కంపోజ్ చేశాడు ).

నవీన్ నూలి ఎడిటింగ్, పరమహంసా ఫోటోగ్రఫీ బాగున్నాయి.

ఒక్క విషయం లో దర్శకుణ్ణి మెచ్చుకోవాలి – ఏంటంటే – హీరో కి ఒక కంటి చూపు చిన్నప్పుడే పోతుంది – సో – ఒక్క కన్నే కనిపిస్తుంది. హీరో కి, అందునా మహేష్ బాబు లాంటి హీరో కి, ఈ వీక్నెస్ పెట్టాడo, దానికి మహేష్ ఒప్పుకోవడం, అనేది గ్రేట్.

మధ్య, మధ్య లో కృష్ణ గారి సినిమా లోని హిట్టు పాటలు బాక్గ్రౌండ్ లో రావడం, సీన్లు కి తగ్గట్లుగా బాగుంది.

త్రివిక్రమ్ కి సెకండ్ ఆఫ్ లో ఒక సోలో సాంగ్, సింఫోనీ టైపు కంపోజింగ్ తో అలవాటు అయిపోయింది.

అరవింద సమేత లో – పెనిమిటి

అ ఆ లో వెళ్లిపోకే శ్యామల

ఇప్పుడు – గుంటూరు కారం లో మామా ఎంతైనా పర్లేదు బిల్లు
కధ లో హీరో / క్యారెక్టర్ ల మూడ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, త్రివిక్రమ్ ఈ సాంగ్ పెడుతున్నాడు – కొత్త గా రాసుకుని – ఇక ఈ ట్రెండ్ లోంచి బయట కు రావాలి.

ఇంకొక పాయింటు – త్రివిక్రమ్ ఈ మధ్య వచ్చిన సినిమాలోని కధల్లో ఒక థ్రెడ్ కంపల్సరి గా ఉంటోంది –
అదేంటంటే –
ఏదో ఒక్క సంతకం / డాకుమెంట్స్ కోసం – హీరో విల్లన్ ఇంటికి వెళ్లడం

S/O సత్యమూర్తి లో హీరో ఆస్థి డాకుమెంట్స్ కోసం విలన్ ఇంటికి వెళ్లడం.

అల వైకుంఠ పురం లో విలన్ సముద్ర ఖని బిజినెస్ అమ్మే డాకుమెంట్స్ మీద సంతకం పెట్టమని హీరో పేరెంట్స్ వత్తిడి చేయడం.

అత్తారింటికి దారేది లో బోర్డు మీటింగ్ కి ఒక్క ఓటు తక్కువయ్యిందని మేనత్తని తేవడానికి హీరో ఇండియా కి రావడం.

ఫైనల్ గా చెప్పేదేంటంటే, గుంటూరు కారం లో మహేష్ పూర్తిగా త్రివిక్రమ్ ని నమ్మాడు – అన్ని సినిమాల లాగానే – మహేష్ తన పాత్ర కి పూర్తి న్యాయం చేశాడు.
త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ లో, టెంపో మిస్ అయ్యింది.

గుంటూరు కారం లో మహేష్ సూపర్ హిట్టు. రమణ గాడి పాత్ర లో జీవించాడు అనొచ్చు. మనం ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకునేంతగా ఈజ్ తో చేశాడు.
మహేష్ కామెడీ టైమింగ్ సూపర్.

 

దర్శకుడి గా, కధకుడి గా త్రివిక్రమ్ – ఫెయిల్ అయ్యాడు. తన మార్కు మేజిక్ మిస్ అయింది.
పాత్ర ల మధ్య లో బాండింగ్ లేక, త్రివిక్రమ్ నిరాశ పరిచాడు.
అత్తారింటికి దారేది లాగా అమ్మ గారింటికి దారేది కధ
రాసుకున్నాడు – కాకపోతే – ఆ బిడ్డ అమ్మింటికి దారి మిస్ అయ్యాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరే ఒక మేజిక్ – డౌట్ లేదు.
అయన మాటల్లోనే చెప్పాలంటే – ఆయనింట్లోని, భీమవరం లోని శాఖా గ్రంధాలయం లో పుస్తకాలు అయిపోయాయేమో కానీ, త్రివిక్రముడి మస్తీష్కం లో మాత్రం కాదు. అయన కలం విదిల్చి మళ్ళా రాస్తే, అద్భుతమైన వంటకాల్ని, సినీ యావనిక ల మీద వండగలడు – ఎందుకంటే – తల్లి, చెల్లి, అత్తయ్య, మావయ్య, కొడుకు, కూతురు, మేనల్లుడు – ఈ సంబంధాల మీద త్రివిక్రమ్ రాసిన / చెక్కిన పాత్రలు ఎన్నో తెలుగు వాళ్ళ ఇళ్లల్లోకి వచ్చి, ఆనందాల్ని పంచాయి.ఆయన మీద అభిమానం తో రాస్తున్న మాటలే ఇవి.

మహేష్ కోసం, ఒక ఫీల్ గుడ్ సినిమా కోసం – హ్యాపీ గా ఫ్యామిలీ మెంబెర్స్ తో గుంటూరు కారం సినిమా చూడొచ్చు.

రమణ గాడి ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా!!!- సత్య కేశరాజు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్