- Advertisement -
By ఆముదాల వెంకన్న
జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇళ్లస్థలాల సాధనకు భారీ ధర్నా నిర్వహించారు. 18 ఏళ్లుగా పోరాడుతున్నా సమస్య పరిష్కారం కాలేదని సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఇళ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పలువురు రాజకీయ, జర్నలిస్టు సంఘాల నాయకులు ధర్నాకు మద్దతు తెలిపారు.
- Advertisement -




