ఆకాశంలో ఒక తార’ లాంటి సినిమా తీస్తే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారో రుజువైంది : నిర్మాత అల్లు అరవింద్
“It has been proven that if a film like ‘Akashamlo Oka Tara’ is made, the audience will embrace it wholeheartedly,” says producer Allu Aravind.
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయిక. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి జరిగాయి. రాత్రి పది గంటల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. పత్రికాధిపతులు కూడా ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారని మెచ్చుకున్నారు. కొంతమంది ఎమోషనల్‌గా ఫోన్ చేశారు. ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలతో పాటు, ఇన్నేళ్ల నా ఫిలిం మేకింగ్ జర్నీలో నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయాన్ని చెప్పాలి. ఈ సినిమా తీస్తున్నప్పుడు మంచి సినిమా తీస్తున్నామని అనుకున్నాం. అది జనాల్లోకి ఎలా వెళ్తుందో మాకు తెలియదు. లేదంటే మా ప్రయత్నం మేము సిన్సియర్‌గా చేశాం. దానికి 10 రెట్లు రెస్పాన్స్ మీడియా నుంచి, ప్రేక్షకుల నుంచి వస్తుంటే ఈ రోజుకి నాకు ఒక కొత్త అనుభూతి కలిగింది. ఒక మంచి సినిమా తీస్తే ఇంతగా ఆదరిస్తారా అనిపించింది. ఈ సినిమాలో హీరో, విలన్ అంటూ ఏమీ లేరు. అన్ని పాత్రలే ఉన్నాయి. ఇంతగా ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా ఉంటే మీడియా ఎంతగా ఆదరిస్తుందనేది ‘ఆకాశంలో ఒక తార’ ద్వారా కనిపిస్తోంది. మా దర్శకుడు పవన్ సాదినేని సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. తన నెక్స్ట్ సినిమా నాతోనే చేయబోతున్నాడు. నన్ను అంతగా ఆశ్చర్యపరిచాడు. నా మిత్రుడు గున్నం గంగరాజు ఎక్సలెంట్ స్క్రీన్‌ప్లే అమర్చాడు.ఆయనతో నాకు 30 ఏళ్ల స్నేహం. ఆయన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తీసినప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్‌ని. అశ్వినీదత్, నేను కలిసి ఏడు సినిమాలు చేశాం. ఇప్పుడు స్వప్న కూడా అచ్చు అశ్వినీదత్ గారి లాగా అంతే వేగంతో వర్క్ చేస్తుంది. అలాగే సందీప్, విద్య అందరూ కూడా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు. ఓవర్సీస్లో కూడా రెస్పాన్స్ మామూలుగా లేదు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన దుల్కర్‌కి థాంక్యూ. తను ఈ సినిమాలో జీవించాడు. సాత్విక ఈ సినిమాతో చాలా పెద్ద స్టార్ అయిపోయింది. సాత్విక మరో రెండు సినిమాలు మాతో చేస్తుంది. నాగచైతన్యతో చేయబోయే సినిమాలో కూడా తనే హీరోయిన్. అలాగే సెకండ్ హాఫ్‌ని భుజాల మీద తీసుకువెళ్లిన శ్రుతి హాసన్‌కి థాంక్యూ. తన పాత్రకు ఇంకెవరూ సరిపోరు. అంత అద్భుతంగా చేసింది. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.’
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. అరవింద్ గారు, నేను కలిసి ఎన్నో సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. అరవింద్ గారి లాంటి స్నేహితుడిని, నిర్మాతను నా జీవితంలో చూడలేదు. చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో కలిసి ఈ సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు చాలా గొప్ప, అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
డైరెక్టర్ పవన్ సాదినేని మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్, సపోర్ట్ అన్బిలీవబుల్. సినిమా విడుదలైనప్పటి నుంచి, నిన్న ప్రీమియర్ నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. అదే ఈ సినిమా విజయానికి కొలమానం. మేము ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ప్రేక్షకులు అంత గొప్పగా ఆదరించారు. అరవింద్ గారు నాకు మొదటి నుంచి ఎంతో నమ్మకాన్ని ఇచ్చారు. ఆయన ఈ సినిమాకి గ్రేటెస్ట్ పిల్లర్. అలాగే దత్తు గారు చాలా బ్యూటిఫుల్ పర్సన్. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయన దర్శకుడిగా నన్ను ఎంతో గౌరవిస్తారు. ఆయనతో కలిసి సినిమా చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అలాగే గున్నం గంగరాజు గారికి నేను చిన్నప్పటి నుంచి అభిమానిని. ఆయన స్క్రీన్‌ప్లే రాయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ముందుగా నన్ను ఎంతో నమ్మిన సందీప్, రమ్యకి థాంక్యూ. అలాగే స్వప్న, విద్యా గారు మాకు ఎంతో బూస్ట్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాకి సెకండ్ హీరో అంటున్నారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దుల్కర్ గారికి, నటీనటులందరికీ థాంక్యూ వెరీ మచ్.





