- Advertisement -
By Chavva Santhosh Kumar
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భార్యను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు నరేందర్‌కు సహకరించిన అతడి తండ్రి హరిలాల్, సోదరుడు సురేందర్, స్నేహితుడు శోభన్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 3న కులాంతర వివాహం చేసుకున్న భార్యను కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేసి గోదావరి నదిలో పడేసిన ఘటనకు సంబంధించి కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.హత్యకు సహకరించిన హరిలాల్, సురేందర్, శోభన్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
- Advertisement -




