ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం 14వ డివిజన్ కొత్తగూడెంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాసభ జిల్లా అధ్యక్షుడు రావుల హనుమంతరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. యువత విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. పగడాల మల్లేష్, కొప్పెర ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular