- Advertisement -
By Singamsetty Sandeep
మంగళగిరి మండలం ఏర్రాబాలెంలోని నాగేంద్రస్వామి పుట్టరోడ్డు సమీపంలో ఓ అంగన్వాడీ టీచర్ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమెకు గత భారీ వర్షాలకు సైతం కారని పైకప్పు ఇప్పుడు చిన్న వానకే కురిసి ఇల్లంతా నీటితో నిండిపోవడం ఆశ్చర్యం కలిగించింది. పగిలిన రేకులను గుర్తించిన ఆమె వ్యక్తిగత కక్షతోనే ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
- Advertisement -




