- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రదర్శించారు. రాజ్యాంగ అంశాలపై క్విజ్, వ్యాసరచన పోటీలు చేపట్టారు. డైరెక్టర్ డా. గొల్లపూడి వీరేంద్ర చౌదరి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలను ఆచరించాలని సూచించారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న, ముస్తఫా, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -




