- Advertisement -
By Rachakonda Ramachandra Raju
మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం మహాభాగ్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.బుధవారం సూర్యాపేటలోని శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ మీలా మహదేవ్,విజయకుమారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.అన్నదానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని,ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు,కౌన్సిలర్లు,స్వాములు భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -




