రాజ్య తండాలో వైభవంగా కోటి దీపోత్సవం

- Advertisement -

By ఆముదాల వెంకన్న

రాజ్య తండా గ్రామంలోని దేవుడు మాన్యం శివాలయంలో శివయ్య స్వామి పీఠం వద్ద కోటి దీపోత్సవం, మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బానోతు భరత్ కుమార్ శివ స్వామి ఆధ్వర్యంలో బానోతు భరత్ స్వామి, తేజావత్ నాగేశ్వరరావు, గుగులోతు భాష స్వాముల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం నిర్వహించి అన్నప్రసాదం అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular