- Advertisement -
By MOHAMMAD
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోఫాన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయని ఆయన వివరించారు.
- Advertisement -




