Sunday, September 8, 2024

1952లో లక్ష… ఇప్పుడు 40 లక్షలు

- Advertisement -

పదింతలైన అసలు ఖర్చు

హైదరాబాద్, నవంబర్ 29, (వాయిస్ టుడే):  స్వతంత్ర భారత దేశంలో 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసే అంశం డబ్బు. ఇది ఎవరూ కాదనలేరు. ఈ నేపథ్యంలోనే డబ్బు విచ్చలవిడిగా అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల సంఘం పలు నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ. 40 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ వ్యయ పరిమితి తొలినాళ్లలో రూ. లక్ష మాత్రమే ఉండగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు రూ.40 క్షలకు చేరింది.స్వతంత్ర భారత దేశంలో 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మొత్తంలోనే అభ్యర్థులు ఖర్చు చేసేవారు. నేటి తరహాలో ఇంత ఖర్చు, డబ్బుల పంపిణీ కూడా ఉండేది కాదు. దీంతో అప్పుడు రూ.లక్ష భారీగా అనిపించింది. తర్వాత 1962 నాటికి వ్యయ పరిమితి రూ.3లక్షలకు, 1971 ఎన్నికల్లో రూ.4 లక్షలకు, 1975 నాటికి రూ.5 లక్షలు చేరింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరగా, 1991 నాటికి రూ.12 లక్షలకు పెంచారు. ఆతర్వాత 1999లో రూ.15 లక్షల 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని నిర్ణయించారు. 2018లో రూ.35 లక్షలు ఉండగా, ఇది ప్రస్తుత ఎన్నికల్లో రూ.40 లక్షలకు చేరుకుంది. ఎఇక వాస్తవ పరిస్థితి చూస్తే గడిచిన మూడు ఎన్నికల పరంగా చూస్తే ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితికంటే.. అభ్యర్థులు పది రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఉన్నంత డబ్బు ప్రవాహం దేశంలోని ఏ రాష్ట్ర ఎన్నికల్లో లేదని ఈసీ కూడా గుర్తించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను చూస్తే తెలంగాణలోనే 500 కోట్ల రూపాయలు పట్టుపడడం ఇందుకు నిదర్శనం. కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేయనిదే ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి. ప్రనస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో రూ.100 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్