Monday, March 23, 2026

10 వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా

- Advertisement -

మట్టి వినాయకులను పూజిద్దాం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ  (వాయిస్ టు డే) : విఘ్నేశ్వరుడిని పూజించే ప్రక్రియలో భాగంగా రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించి ప్రజలు  విఘ్నాల బారిన పడకూడదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు హన్మకొండ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఉద్బోధించారు. యావత్ భారతదేశం అమితంగా ప్రేమించే వినాయకుడికి కూడా మట్టితో తయారు చేసిన ప్రతిమలే బాగా ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి జరుగనున్న వినాయకచవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజు హన్మకొండ జిల్లా బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మట్టితో తయారుచేసిన వినాయకుడి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయకచవితి పండుగను పురస్కరించుకొని 10 వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చెయ్యాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా చీఫ్ విప్ మాట్లాడుతూ కొద్దీ సవంత్సరాలుగా యావత్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఆన్న అంశం మీద ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని ఆయన ఆందోళన  వ్యక్తం చేశారు. ఆ చర్చలో మనం జరుపుకోబోయే వినాయకచవితి పర్వదినం ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్త పరిచారు. ప్రకృతిని కాపాడుకుంటూ వైపరిమితిని పెంపొందిచుకోవాల్సిన మనం ప్రకృతితో ఛాలెంజ్ వేసే పద్దతిలో చర్యలకు పూనుకొని మనకు మనం నీర్వీర్యమైపోతున్నామన్నారు.మన భారత దేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వం  మెలసి జీవిచేందుకు పండుగలు దోహద పడుతున్నాయని, అంతే గాకుండా దేశ సంస్కృతి,సంప్రాదాయాలను ప్రతిబింబిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహాం లేదని వ్యాఖ్యానించారు . అయితే అదే సమయంలో రసాయనాలతో తయారుచేసిన వినాయక ప్రతిమలతో వాతావరణం కాలుష్యమౌతుందన్న ప్రమాదాన్ని ప్రజలు గమనించడం లేదని  వాపోయారు. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఆదినుండి జరుపుకునే గ్రామదేవతల పండుగలు అన్ని కూడా ప్రకృతి కాపాడుకునేందుకేనని  అందులోభాగం అయిన వినాయకచవితి మాత్రం రసాయనాల బారిన పడి ప్రకృతిని మలినం చేస్తుందన్నారు.  మొక్కలు ఒక్కటి నాటడమే ప్రకృతిని పరిరక్షించడం కాదని ప్రకృతితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా ప్రకృతి ధర్మమని ఆయన చెప్పారు. అందులో భాగంగానే వరంగల్ పశ్చిమ లో గడిచిన ఐదు సవంత్సరాలుగా మట్టి వినాయకుల ప్రతిమలను ప్రోత్సహిస్తున్నట్లు చీఫ్ విప్   వెల్లడించారు. వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలలో మట్టి వినాయకులతో చేసిన ప్రతిమలను వినియోగించడం లో హన్మకొండ జిల్లా యావత్ తెలంగాణ జిల్లాలకు ఓ రోల్ మోడల్ గా వ్యవహరించాలని చీఫ్ విప్   ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి , కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు,బిఅర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్