105నేరాల నివారణ, నేర చేదనే లక్ష్యంగా పని చేయండి
105 Work towards crime prevention and crime prevention
మల్టీజోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి
ప్రజా సమస్యలపై సత్వరంగా స్పందించండి
శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించండి.
జగిత్యాల,
శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో పోలీసు అధికారులు,సిబ్బంది పనితీరు బెస్ట్
ఆని మల్టీజోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.శుక్రవారం
జిల్లాలోని డిఎస్పి, సి.ఐ,ఎస్.ఐ స్థాయి అధికారులతో జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా పర్యటన కు మల్టీజోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన సందర్భంగా
ముందుగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐజి కి పులమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాల చే గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, పోలీస్ అధికారుల పనితీరు, జిల్లాలో నమోదైన కేసుల వివరాలను ఐజిపి కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవలసిన ప్రత్యేక చర్యల గురించి చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పోలీస్ అదికారులకు, సిబ్బంది ఎదురవతున్న సమస్యలను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మల్టీజోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమర్థవంతమైన పోలీసు వ్యవస్థతోనే శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటాయని అన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని నిజాయితీ తో విధులు నిర్వహిస్తూ, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ఠలు తీసుకవచ్చే పోలీస్ అదికారులకు,సిబ్బందికి అండగా నిలుస్తానని అన్నారు.జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, జిల్లా ఎస్పీ నేతృత్వంలో పోలీస్ అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల గురించి చేస్తున్న కృషి అభినందనీయమని వారి పనితీరు
బెస్ట్ గా ఉందని అన్నారు. ఎస్పీ, డిఎస్పీ లు క్రమం తప్పకుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను ప్రత్యక్షంగా సందర్శించి, వారి పనితీరు సమీక్షించాలని,తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వాటి ప్రకారం నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవటంలో, నేరపరిశోధనలో, సాంకేతిక ఆధారాలను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి లు రఘు చంధర్, రాముల, రంగారెడ్డి, మరియు
డీసీఆర్భీ,ఎస్భీ,ఐటీ కోర్, సీసీఎస్, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,నిరంజన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేష్,ఎస్.ఐ లు,డీసీఆర్భీ
,ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.