- Advertisement -
పదవ తరగతి విద్యార్థిని పై కర్రతో దాడి
10th class student assaulted with a stickగత కొన్ని రోజులుగా వేధిస్తూ ఇంటికి వెళ్లి మరీ దాడి చేసిన నిందితుడు
నెల్లూరు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లి లో అమానుష ఘటన చోటుచేసుకుంది, పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే ప్రాంతానికి చెందిన మాదర్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ప్రేమించాలని వేధిస్తూ వున్నాడు. గురువారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లి కర్ర తో తల మీద దాడిచేయగా విద్యార్థినికి గాయాలయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కూతురుని అదే ప్రాంతానికి చెందిన మాదర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తాము ఎన్నిసార్లు చెప్పినా తమ మాట వినడం లేదని హఠాత్తుగా ఈరోజు కత్తి కర్ర తీసుకువచ్చి తమ ఇంటి మీద దాడికి వచ్చాడని తమ కూతురి మీద దాడి చేయబోవుగా అడ్డుకున్న తల్లి పైన కూడా దాడి చేశాడని కర్రతో తమ కూతురి తలపై కొట్టడంతో గాయాలు అయ్యాయని అన్నారు. ఈ మాదర్ నుండి తమ కుటుంబానికి తమ కూతురుకు ప్రాణహాని ఉందని విద్యార్థిని తల్లితండ్రులు వాపోతున్నారు, ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని మాదర్ నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు…
- Advertisement -




