Tuesday, March 18, 2025

ఏడాదిలో 1365 కోట్ల హుండీ ఆదాయం

- Advertisement -

ఏడాదిలో 1365 కోట్ల హుండీ ఆదాయం

1365 crore hundi income in a year

తిరుమల, జనవరి 3, (వాయిస్ టుడే)
2024 ఏడాదిలో తిరుమల శ్రీవారికి వచ్చిన హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది. 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించారని… మొత్తం 12.44 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు పేర్కొంది.ఇక నూతన సంవత్సరం వేళ జనవరి 1, 2025వ తేదీన తిరుమల శ్రీవారి 69,630 భక్తులు దర్శించుకున్నారు. 18,965 మంది తలనీలాలను సమర్పించగా… రూ. 3.13 కోట్లు హుండీ కానుకులు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది..తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్‌ చేసుకున్న దాతలను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్‌ చేసుకోవచ్చు.జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు. తదుపరి రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేయడమైనది.భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు, అయితే ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. జనవరి 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
కిటకిటలాడుతున్న కొండ
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. జనవరి 1వ తేదీ నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కొత్త ఏడాది ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. అదే సమయంలో దర్శన సమయం కూడా ఆలస్యమవుతుంది. కంపార్ట్ మెంట్ లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో తిరుమల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే లక్షల్లో టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వైకుంఠం ద్వార దర్శనం ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా తగ్గించేందుకు టీటీడీ సిద్ధమయింది. సిఫార్సు లేఖలను కూడా ఈ సమయంలో పెద్దగా అనుమతించబోరని అంటున్నారు. ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మరొకవైపు ఇంకో లక్ష టిక్కెట్లను తిరుమల, తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయించడానికి టీటీడీ సిద్ధమవుతుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు ముందుగానే వచ్చి తిరుమల ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్