రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం

- Advertisement -

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం
Sandstorm Wreaks Havoc in Rajasthan

న్యూ ఢిల్లీ మే 30 :
రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, బికనేర్‌ ప్రాంతాలను ఇసుక తుపాను అతలాకుతలం చేసింది. సునామీ తరహాలో భారీ ఈదురు గాలులతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది. ఇసుక తుపానుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుపాను ధాటికి పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఇసుక తుపాను అనంతరం కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది.
రాజస్థాన్‌లోని చురు, బికనేర్‌ ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశాన్ని భారీ ధూళి మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే రాత్రిని తలపించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భయంకరమైన ఇసుక తుఫాను విరుచుకుపడింది. సుడిగాలిలా చెలరేగిన భారీ ధూళి మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. విపరీతమైన వేగంతో గాలులు వీయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై కొద్ది మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలు హెడ్‌లైట్ల సాయంతో మెల్లగా కదిలాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular