కౌంటింగ్ కేంద్రాలలో 144 సెక్షన్: సిపి చౌహన్

- Advertisement -

రాచకొండ: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా రేపు ఎల్బీనగర్ నియోజకవర్గం కి సంబంధించి ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మరియు ఈవీఎం, వివి  ప్యాడ్స్ లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం లని  రాచకొండ సిపి చౌహన్ పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ  కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని అన్నారు.

144 Section of Counting Centers: CP Chauhan
144 Section of Counting Centers: CP Chauhan

రాచకొండ పోలీస్ పరిధిలో నాలుగు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి భువనగిరి లో ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్, ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మేడ్చల్, ఉప్పల్ కూకట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో, మహేశ్వరం , ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గం కేంద్రాలు సివిఆర్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాచకొండ సిపి జాయింట్ సీపీ భద్రత  పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. మీడియా పాయింట్స్ సెంటర్లో మినిట్స్ టు మినిట్స్  ప్రతిదీ లైవ్ స్క్రీన్ లో అప్డేట్ ఇవ్వడం జరుగుతున్నది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ర్యాలీలకు బాణ సంచాలకు అనుమతి లేదు ఆఫ్ కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular