టిడిపిలోకి చేరిన 15 కుటుంబాలు
తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామం నందు తుగ్గలి మండలం అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, రాంపల్లి గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో సోమవారం రోజున పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ,బిజెపి మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి కేఈ.శ్యామ్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుండి 15 కుటుంబాలు టిడిపి పార్టీలోకి చేరాయి.ఈ సందర్భంగా పత్తికొండ టిడిపి నియోజకవర్గ అభ్యర్థి కేయి శ్యాంబాబు వారికి తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏకాశి ఓబులేసు,ఏకాశి ఓబులయ్య,పెద్ద పులికొండ,చిన్న పులికొండ, పావుల నాగన్న,పులికొండ రంగస్వామి, హోసూరు రంగయ్య,చిట్యాల రంగనాయకులు, ఊరవుల జయరాముడు,దబ్బల రామాంజనేయులు,దబ్బల సతీష్ కుమార్, బుచ్చి రామానాయుడు వారి 15 కుటుంబాలు వైసిపి నుండి టిడిపిలోకి చేరారు.అదేవిధంగా హుస్సేన్ పురం గ్రామానికి చెందిన ఇల్లికాసిం పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కేయి శాంబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో మాది జెడ్పీ చైర్మన్ బత్తిని వెంకట రాముడు,రాంపల్లి గ్రామం టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.