వర్గీకరణ లో న్యాయం ఉంది
మాదిగ జాతి నాకు అండగా నిలబడాలి
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్
Madiga nation should stand by me
CM Revanth Reddy
ఈ ప్రభుత్వం మీది. మీరంతా కోరుకుంటే , ప్రజా పాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారు ఒక వైపు, చచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ది తో మేం చేసిన ప్రయత్నం మరో వైపు. మాటలు, మూటలతో అయితే మేం ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
శిల్ప కళా వేదికలో జరిగిన మాదిగ ఆత్మీయ సభలో అయన మాట్లాడారు.
చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారని అన్నారు.
నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు.. బలహీనుల పట్ల నిలబడి కొట్లాడటం అనే గొప్ప లక్షణం ఉన్నవాడు. వర్గీకరణ లో న్యాయం ఉంది.. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డాను. రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్కన నిలబడ్డాను. నా ప్రయత్నంలో మంత్రి వర్గ సహచరులు, అధికారులు సమయస్పూర్తిని చూపించి అండగా నిలబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం మనదే. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోచ్చు. ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు , లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరు ఆపాలి. వెనక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించా



