Sunday, September 8, 2024

ఘనంగా సద్గురు  త్యాగరాజస్వామివారి 177వ ఆరాధనోత్సవం

- Advertisement -

ఘనంగా సద్గురు  త్యాగరాజస్వామివారి 177వ ఆరాధనోత్సవం
తిరుపతి
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో సద్గురు  త్యాగరాజస్వామివారి 177వ‘పుష్యబహుళ పంచమి’ ఆరాధనోత్సవం మంగ‌ళ‌‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి పంచరత్నకృతుల బృందగానం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తిరుపతికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు ఈ బృంద‌గానం చేశారు.
: త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని  శ్రీ న‌ట‌రాజ‌స్వామి, శ్రీ త్యాగరాజస్వామివారి పంచలోహ విగ్రహాల‌కు, శ్రీసీతారామలక్ష్మణులు, హనుమంతుని చిత్ర‌ప‌టానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్వీ నాదస్వర పాఠశాల అధ్యాప‌కులు, విద్యార్థుల మంగ‌ళ‌వాయిద్యంతో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.
ఈ సంద‌ర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దు బాల పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్నకృతుల బృందగానం సంగీతప్రియులను మంత్రమగ్ధులను చేసింది.

ముందుగా నాట రాగం, ఆది తాళంలో ‘జగదానందకారక జయజానకీ ప్రాణనాయక…. కీర్త‌న‌తో ప్రారంభించారు. ఆ త‌రువాత వ‌రుస‌గా గౌళరాగం, ఆదితాళంలో ‘దుడుకుగల న న్నేదొర కొడుకు బ్రోచురా…’, ఆరభి రాగం, ఆదితాళంలో ‘సాధించెనే ఓ మనసా(సమయానికి తగు మాటలాడెనె)…’, వరాళి రాగం, ఆదితాళంలో ‌’కన కన రుచిరా – కనకవసన! నిన్ను…’, శ్రీ రాగం, ఆదితాళంలో ‘ఎందరో మహానుభావు – లందరికి వందనము…’ ఐదు పంచరత్న కృతుల‌ను రాగయుక్తంగా ఆలపించారు. గాత్ర సంగీత కళాకారులతో పాటు వీణ, వయోలిన్‌, వేణువు,  మృదంగం తదితర అన్ని వాయిద్యాల కళాకారులు బృందగానంలో అత్యద్భుతంగా సహకారం అందించారు. ఈ బృంద గానంలో కాత్ర సహకారం అందించిన వారు  కె.వంద‌న‌,  శైల‌జ‌,  చిన్న‌మ్మ‌దేవి,సంగీత లక్ష్మి బృందం, వయోలిన్ పై జయరాం , మృదంగంపై సుధాకర్ రమేష్ వీణపై శ్రీవాణి తదితరులు సహకారాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో  సీనియ‌ర్ అధ్యాప‌కులు, కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థిని విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్