- Advertisement -
18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంఖు స్థాపన
18 crore laying of foundation stone for beautification development of Husnabad Ellamma pond embankment
హుస్నాబాద్ మున్సిపాలిటీ లో భారీగా సీసీ రోడ్లు ,మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన
భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుంచుతా
వ్యవసాయ రైతు సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం
జనవరి 26 నుండి పెరిగిన రైతు భరోసా & భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక అమలు – మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ మున్సిపాలిటీనీ మరింత అభివృద్ధి చేయడానికి దాదాపు 26.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. 18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ మరియు అభివృద్ధికి శంఖు స్థాపన చేశారు. 6 ,7,11,12,13,17,19 ,20 వార్డు లలో ప్రతి వార్డు కి 50 లక్షల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణం , మురికి కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వర్ణకార కమ్యూనిటీ మినీ స్పోర్ట్స్ హల్ , అయ్యప్ప నగర్ లో యాదవ కమ్యూనిటీ రీడింగ్ రూం , మెడలయ్య వద్ద రజక కుట్టు యంత్ర శిక్షణ కేంద్రాలను శంఖు స్థాపన చేశారు.,బురుజు వద్ద 3 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన రైతు బజార్ ను ప్రారంభించారు. కోటి రూపాయలతో వ్యవసాయ మార్కెట్ లో నిర్మించిన కవర్ షెడ్ గోదాం ను ప్రారంభించారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైన ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి 18 కోట్లు టెండర్ అయి పనులు ప్రారంభం అయ్యేలా శంఖు స్థాపన చేసుకున్నమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్ లో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చేలా ఎల్లమ్మ చేరవు అభివృద్ది చేస్తామన్నారు. పక్కనే గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ లో చుట్టూ కొండలు పర్యాటకానికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
హుస్నాబాద్ పట్టణంలో మరో రెండు కోట్లతో అంబేద్కర్ , గాంధీ ,అనబేరి ప్రభాకర్ ,కొండా లక్షణ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేసి జంక్షన్ లకు 50 లక్షల చొప్పున కేటాయించుకొని సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు.ప్రతి వార్డు కి 50 లక్షలతో అభివృద్ది, ప్రతి కుల సంఘాలకు 45 లక్షలతో కమ్యూనిటీ హాల్ లు నిర్మిస్తున్నామని తెలిపారు.
- Advertisement -