జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్
Ram Charan met Pawan Kalyan at the Jana Sena central office.

మెగా పవర్ స్టార్ Ram Charan మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyanను మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం అమరావతిలోని ACA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ రాకతో జనసేన కార్యాలయంలో సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ల సమావేశం అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
మర్యాదపూర్వక భేటీ అనంతరం రామ్ చరణ్ అమరావతిలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి బయలుదేరారు.




