18 సం. నిండని మైనర్లు వాహనాలు నడపవద్దు
18 years Do not drive underpowered vehicles
కోరుట్ల ఎస్సై రామచంద్రం గౌడ్
కోరుట్ల,
:18 సంవత్సరాలు నిండని మైనర్లు వాహనాలు నడపవద్దని, ఒకవేళ నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని కోరుట్ల ఎస్సై రామచంద్రం గౌడ్ అన్నారు.
36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను భాగంగా పోలీసులు రోడ్డు భద్రతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేరళ హై స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
ఎస్సై రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ
రోడ్డు భద్రత ఒక నినాధం కాదని ఒక జీవన విధానం అని అన్నారు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా విద్యార్థులు నడప రాదని, డ్రైవర్లు విధినిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలను నడపొద్దని విధిగా సీటుబెల్టు ధరించాలని సూచించారు.. 18 సంవత్సరాలు లో బడిన మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని వాహనాలు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలని వాహనం యొక్క పూర్తి కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే నడపాలని ఏమాత్రం సమస్య ఉందని అనిపించినా వెంటనే పరిష్కరించుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని పాఠశాల వాహనాల డ్రైవర్లకు సూచించారు అన్నారు..మైనర్లకు ఎట్టిపరిస్థితుల్లో వాహనాలను నడపడానికి ఇవ్వవద్దని సూచించారు. అనునిత్యం రోడ్లపైకి లక్షల్లో వాహనాలు వస్తుంటాయని ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని అన్నారు.మనం ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలను చూస్తూనే ఉన్నామని ఆ ప్రమాధాల కారణంగా ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని కావున ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు..అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం పెద్ద నేరమని తప్పకుండా లైసెన్సు పొందిన తర్వాతనే వాహనాలను నడపాలని సూచించారు..వాహన ఓనర్లు కూడా డ్రైవర్లను నియమించుకునే ముందు లైసెన్సులను పరిశీలించిన తర్వాతనే నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సెలిన్ భారీ, కరస్పాండెంట్ భారీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల వాహనాలు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.