Sunday, September 8, 2024

రాజముండ్రి పరిసరాల్లో  “1920 భీమునిపట్నం”

- Advertisement -

రాజముండ్రి పరిసరాల్లో  “1920 భీమునిపట్నం”

కంచర్ల ఉపేంద్ర  అపర్ణాదేవి  హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం  “1920 భీమునిపట్నం”.. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ  చిత్రం చిత్రీకరణ రాజముండ్రి పరిసరాల్లో జరుపుకుంటోంది. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ను ప్రాంభించుకుని, అక్కడే పది రోజులపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం యూనిట్ రాజముండ్రికి వెళ్లి, అక్కడి పరిసరాల్లో హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా  నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, “రాజమండ్రిలో కూడా పది రోజుల పాటు షూటింగ్ జరుపుతాం. .
హీరో, హీరోయిన్ల పై గోదావరి నేపథ్యంలో సన్నివేశాలను తీయడం జరుగుతోంది. ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే  ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథానుసారం సంగీతం, ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రాణంగా నిలుస్తాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం  ఓ హైలైట్. రాజముండ్రి తర్వాత విశాఖపట్నం, అరకు, ఊటీలలో కూడా చిత్రీకరణ జరుపుతాం” అని చెప్పారు.
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, “భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణా దేవి కనిపిస్తారు” అని అన్నారు. .
హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ అపర్ణాదేవి మాట్లాడుతూ, “అద్భుతమైన పీరియాడికల్ చిత్రంలో నటించే అవకాశం అరుదుగా లభిస్తుంటాయి. ఎందుకంటే అలాంటి కథ, దానిని అదే స్థాయిలో తెరకెక్కించగల దర్శకుడు, రాజీపడకుండా, అభిరుచి కలిగిన నిర్మాత కలయికలోనే ఈ తరహా చిత్రం వస్తుంది. కెరీర్ మొదట్లోనే అలాంటి చిత్రంలో నటించడం మా అదృష్టం అని” చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో యండమూరి ప్రవీణ్, ఘర్షణ శ్రీనివాస్, పవిత్ర లోకేష్, తిలక్, జెన్నీ తదితర
పాత, కొత్త నటీనటులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సినిమాటోగ్రఫీ: ఎస్.మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, కళ: సురేష్ భీమగాని, సహ నిర్మాతలు  కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, నిర్మాత: కంచర్ల అచ్యుతరావు,  రచన, దర్శకత్వం: నరసింహ నంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్