త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

- Advertisement -

త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

హైదరాబాద్, డిసెంబర్ 27

హైదరాబాద్:
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాలపై ఫోకస్ చేపట్టామన్న రేవంత్ రెడ్డి  ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై ఇదివరకే స్పందించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం తరువాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చారు. డిసెంబర్ 9 2024 లోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యోగార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం నియమించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ తమిళిసై ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని, ఎవరూ ఆందోళన చెందొద్దని నిరుద్యోగులకు సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular