- Advertisement -
అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేశాం
2 lakh loan waiver for every eligible farmer
గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు.
కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో పదవులు
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి
నల్గొండ జిల్లా, శాలి గౌరారం వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గం ప్రమాణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరైయారు.స
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పది ఏళ్ల పాలనను,సంవత్సరం ప్రజాపాలనను పోల్చే చూసుకోవాలని కార్యకర్తలకు తెలిపారు. మిగులు బడ్జెట్ తో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన 7 లక్షలు అప్పు చేశారు. చిత్తశుద్ధితో పాలన చేసి,సరైన పద్దతిలో ఖర్చు పెట్టింటే బంగారు తెలంగాణ సాధ్యం అయేది. నిరుద్యోగ సమస్యల ఉండేది కాదు. చేసిన అభివృద్ధి పనులను మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. మరో 90 రోజులలో స్థానిక ఎన్నికలు జరుగతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. మనస్పర్థలు లేకుండా కస్టపడి సమన్వయ గా పనిచేయాలి. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఈ రోజు నియోజకవర్గం లో తిరిగే పరిస్థితి లేదు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహ PACS చైర్మన్ మురళి, డైరెక్టర్లు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -