మేడారం కి 2 వేల బస్సులు

- Advertisement -

నగర ప్రయాణికులకు హెచ్చరిక..! సిటీ బస్సుల్లో వెళ్లి పనులు పూర్తి చేసుకుందామనుకునే వారు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ వాయిదా వేసుకోక తప్పనిసరి పరిస్థితి. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో 2 వేల వరకూ మేడారం జాతరకు వెళ్లనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు జాతరకు కేటాయించగా.. ఈ నెల 21 నుంచి పూర్తి లక్ష్యం మేరకు తరలిపోనున్నాయి. ఇందులో 250 బస్సులు నగరం నుంచి బయలుదేరనుండగా.. మిగతా బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలిపోనున్నాయి. ఆయా రోజుల్లో పనులు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌ల దోపిడీకి గురికాకుండా ఉంటారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే..

మహాలక్ష్మి పథకం అమలుతో నగరంలో తిరిగే ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 18 లక్షలకు చేరింది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఇలాంటి తరుణంలో మేడారం జాతరకు లక్షలాది మంది ప్రయాణికులుంటారని టీఎస్‌ఆర్టీసీ అంచనా వేసింది. అందుకే నగరంలోని 2 వేల బస్సుల వరకూ జాతరకు కేటాయించినట్టు సమాచారం. కేవలం 850 బస్సులే ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular