Thursday, April 24, 2025

 2026 తెలుగు హీరోలదే హవా

- Advertisement -

 2026 తెలుగు హీరోలదే హవా
హైదరాబాద, ఏప్రిల్ 11, (వాయిస్ టుడే )

2026 is the weather of Telugu heroes

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటుంది అంటూ మన హీరోలు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వరుస సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఒక్కో హీరో చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉండడమే కాకుండా మరికొన్ని కథలను వింటూ వాళ్ళందరిని లైన్ లో పెట్టే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మన స్టార్ హీరోలందరు బిజీగా ఉన్నారు. ఇక వరుసగా వాళ్ళు కమిట్ అయిన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2026వ సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు పాన్ ఇండియాను షేక్ చేయబోతున్నాయి అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి 2026 వ సంవత్సరంలో ఏ సినిమాలు వస్తున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.2026 సంవత్సరం ప్రారంభం లో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాతో స్టార్టింగ్ లోనే భారీ విజయాన్ని దక్కించుకొని సినిమా ఇండస్ట్రీకి మంచి బూస్టప్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుందని సినిమా మేకర్స్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు…ఇక మార్చి లో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటుగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాని కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం…ఇక ఈ రెండు సినిమాల మీద భారీ బజ్ అయితే ఉంది…2026 సమ్మర్ కానుకగా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ ‘ సినిమాని తీసుకొస్తున్నారు. ఇక ఇయర్ ఎండింగ్ లో అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే 2026వ సంవత్సరంలో మన స్టార్ హీరోలందరు భారీ విజయాలను సాధించి పాన్ ఇండియాని షేక్ చేయాలని చూస్తున్నారు.ఇక ఒకరి తర్వాత ఒకరు కలెక్షన్ల సునామీని సృష్టించి తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే మూవీ లవర్స్ కి 2026వ సంవత్సరం మంచి ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్