Sunday, September 8, 2024

బీజేపీ లో చేరనున్న  22 మంది ఎమ్మెల్యేలు

- Advertisement -

ఈటెల సంచలన కామెంట్స్

22 MLAs will join BJP
22 MLAs will join BJP

హైదరాబాద్, ఆగస్టు 18:  చేరికల పర్వానికి తెలంగాణ బీజేపీ మళ్లీ శ్రీకారం చుడుతోంది. అమిత్‌ షా పర్యటనలో చేరికలు ఉంటాయని కమలనాథులు ప్రకటించారు. అంతే కాదు రానున్న రోజుల్లో నిత్యం చేరికలు ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయంగా హడావుడి పెరుగుతోంది. చేరికలపై ఇన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న బీజేపీ ఇప్పుడు మళ్లీ ఆ విషయాన్ని ప్రస్తావించింది. 22 మంది త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ తెలిపారు. నిర్మల్‌ వచ్చారు. ఈ సందర్భంగా చేరికల విషయాన్ని ఈటల వెల్లడించారు. అమిత్‌ షా పర్యటనలో కొందరు చేరతారని, ఆ తర్వాత కూడా చేరికల ఘట్టం కొనసాగుతుందని ఈటల రాజేందర్‌ తెలిపారు.ఈ నెల 27న అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నట్లు కనిపించిన బీజేపీ.. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం తన పని తాను స్పీడ్‌గా చేసుకుంటూ వెళ్తోంది. ఈ కారణంగానే ఈటల రాజేందర్ అంత ధీమాగా రాసిపెట్టుకోండి.. 22 మంది వచ్చేస్తున్నారంటూ ప్రకటన ఇచ్చారు. అంతేకాదు.. ఇక వచ్చేవరంతా గెలుపు గుర్రాలే అనడంతో.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో గుబులు మొదలైంది. ఎవరా 22 మంది అని తమలో తాము లెక్కలు సరి చూసుకుంటున్నాయి పార్టీలు. ఇదిలాఉంటే.. గెలుపు గుర్రాలనే తాము బరిలోకి దింపుతామని మరో బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. తాజాగా జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ గురించి చర్చించలేదని, అయితే సమీప భవిష్యత్‌లో రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.మరి ఈటల రాజేందర్ చెప్తున్నట్లు అమిత్ షా పర్యటనలో సంచలనాలు ఉంటాయా? నిజంగానే 22 మంది కీలక నేతలు బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ తరువాత కూడా చేరకలు ఉంటాయా? అంటే పార్టీలు ఒక రకంగా, రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలోని కొందరు బీజేపీకి అంత సీన్ లేదని అంటుంటే.. ఏమో గుర్రం ఎగరావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కారణం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ బీజేపీ వైపు వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపరని అంచనా వేస్తున్నారు. మరి అమిత్ షా పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.కాగా, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల భూములకు విలువ వచ్చేలా మాస్టర్ ప్లాన్ తయారుచేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముందుగా వచ్చిన మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమే, అవసరమైతే దాన్ని రద్దు చేస్తామని మంత్రి ప్రకటించడంతో రైతులు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన విరమించాయి. అయితే తాజాగా మాస్టర్ ప్లాన్ అమలు విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు సమాచారం అందడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని‌ దీక్షకు దిగారు బీజేపీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి. మాస్టర్ ప్లాన్ వెనుక 2 వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందంటున్నారాయన. ఈ ఆరోపణలను నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మహేశ్వర్‌రెడ్డి. మంత్రి అందుకు సిద్ధమా అని సవాల్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్