తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఒక్కోరరికి .25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
25 lakh ex-gratia to each of those who died in the stampede incident
అమరావతి జనవరి 9
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి
రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిని వారిని తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పలువురు
మంత్రులు ఆస్పత్రికి వెళ్లి బాధిత కటుంబాలను పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటుందని మంత్రులు భరోసా కల్పిస్తున్నారు.కాగా తోపులాటలలో ఆరుగురు భక్తులు దుర్మరణం
చెందారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. గురువారం ఉద యం 5గంటలకు జారీచేసే వైకుంఠ ద్వారదర్శ నం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సిబ్బంది ముందుగా భక్తులను రోడ్లపై
గుమికూడకుండా పార్కులో ఉంచారు. అనంతరం పద్మావతి పార్కు నుంచి భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. ఈ సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు
చేయకపోవడంతో తోపులాట జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.