ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 284 అర్జీలు

- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 284 అర్జీలు

284 applications for public problem resolution platform

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు గడువు లోపు పరిష్కారం చెప్పాలి
: జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్

తిరుపతి,
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,  (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువు లోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని  జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా  పీ జి ఆర్ ఎస్ అర్జీలను  నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా  అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు, తదితర అధికారులు ప్రజల  నుండి అర్జీలు స్వీకరించారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను  స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు  రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -148, పంచాయతీ రాజ్ -90, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ – 3, ఎంప్లాయి అండ్ ట్రైనింగ్ -2 , తుడా -2, పశుసంవర్ధక శాఖ – 1, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ -7, పోలీస్ శాఖ -5, ఏపీఎస్ఆర్టీసీ -1, రూరల్ డెవలప్మెంట్ -4, హౌసింగ్ -2, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -2, నేషనల్ హైవేస్ -2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -7, స్కూల్ ఎడ్యుకేషన్ -2, రూరల్ వాటర్ సప్లై -2, అగ్రికల్చర్ -1, ఎండోమెంట్ -1 కోపరేటివ్ సొసైటీ -1, ఆధార్ -1 వెరసి మొత్తం 284 వినతులు  రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా  అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular