- Advertisement -
3వ రోజుల డౌన్ ట్రెండ్
3 days down trend
ముంబై, డిసెంబర్ 21, (వాయిస్ టుడే)
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంనే సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఓసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. గత కొన్ని రోజులుగా క్రితం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గింది. ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300లు తగ్గి రూ.70,390లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330లు తగ్గి రూ.76,790లకు చేరుకుంది. వెండి కిలో ధర నిన్నటితో పోల్చితే రూ. 1,000లు తగ్గి రూ.98,900లుగా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.76,790లుగా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390, 24 క్యారెట్ల ధర రూ.76,790లుగా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,540లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.76,940లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,390లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.76,790లుగా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,390లుకాగా, 24 క్యారెట్లు రూ.76,790 లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.70,390లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.76,790లుగా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.97,900లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో రూ.97,900లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.92,400లు కాగా, ముంబైలో రూ.90,400, బెంగళూరులో రూ.90,400, చెన్నైలో రూ.97,900 లుగా ఉంది.
- Advertisement -