Sunday, September 8, 2024

కొండగట్టులో 3 రోజులు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

- Advertisement -

కొండగట్టులో 3 రోజులు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

జయంతి పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

జగిత్యాల,

ఈనెల 30 నుండి జూన్ 01 వరకు మూడు రోజులు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీ ఆంజనేయ స్వామి  జయంతి సందర్భంగా క్షేత్ర సంప్రదాయ సారముగా హోమ, పూజ, అర్చనాది సేవలతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు. ఈ సందర్భంగా జయంతోత్సవము ఆహ్వాన ప్రతులను, పోస్టర్ ను కలెక్టర్ సోమవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.

శ్రీ హనుమాన్ జయంతి రోజు వారి కార్యక్రమ వివరాలు

29 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు  యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన.
30 న ఉదయం 6 గంటలకు యగశాల శుద్ది, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షాబంధనము, ఋత్విక్  వరణము, అరుణి మధనము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ట హవనము, అభిషేకములు, ధ్వజారోహణము, నవగ్రహ స్థాపన, పారాయణాలు నైవేధ్యము, తీర్థ ప్రసాద వినియోగము.  సాయంత్రం 5 గంటలకు హోమము, మహా నైవేధ్యము, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
మే 31 న ఉదయం 9 గంటలకు హోమము, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణము, అభిషేకము, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన సహస్రనామార్చన (పుష్పాలతో), పారాయణాలు, హోమము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని తెలిపారు.

జూన్ 1న ఉదయం 3 గంటలకు తిరుమంజనము మరియు ద్రావిడ ప్రబంధ పారాయణములు
ఉదయం 9 గంటలకు హవనము, శ్రీస్వామి వారికి  పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన
ఉదయం 10 గంటలకు తులసి అర్చన హోమము
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఊయల సేవ, మంత్ర పుష్పము, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగము, సామూహిక భజన.
సాయంత్రం 5 గంటలకు ఆరాధన
సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి కుంకుమార్చన, ఓడిబియ్యము.
సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సహస్ర దీపాలంకరణ
సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ
సాయంతరం 3 గంటల 30 నిమిషాలకు కంకణోద్వాసన, మంత్రపుష్పము, మహదశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఉంటాయని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  దివాకర, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, కొండగట్టు ఆలయ ఈ. ఓ. చంద్రశేఖర్, డిప్యూటీ ఈ . ఓ అంజయ్య పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్