హైదరాబాద్, నవంబర్ 25, (వాయిస్ టుడే): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మరి ఈ ఎలక్షన్స్ ఎన్ని వేల EVMలు వాడుతున్నారు..? ఎంత మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు?దాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ప్రచారానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అటు ఎన్నికల సంఘం కూడా తమ పనికూడా పూర్తి చేసే పనిలో పడింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నిలక ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ షురూ అయినట్లు చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా రెడీ చేస్తున్నట్లు తెలిపారు.ఇక పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. తెలంగాణలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువా ఉండటంతో ఓటర్ల స్లిప్పుల పంపిణీ కూడా వేగవంతం చేశారు. రాష్ట్రంలో 36వేల ఈవీఎంలను రెడీ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్ లో ఒక అబ్జర్వర్ ఉండనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేయనున్నట్లు ఈసీ తెలిపింది. 80ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు హోం ఓటింగ్ చేపట్టినట్లు తెలిపారు. వారి ఓటును ఇంటే నుంచే సేకరిస్తామని సర్వీస్ ఓటర్లు కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 18 నుంచి 19ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ దఫా కొత్తగా 51 లక్షల ఓటర్ కార్డులు ముద్రించి పంపిణీ చేసినట్లు వికాస్ రాజ్ పేర్కొన్నారు.ఇక అటు బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ తోపాటు, కేటీఆర్, హారీశ్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి జెడ్ స్పీడ్ తో పరుగెడుతున్నారు. అటు రేవంత్ రెడ్డి బహిరంగసభలో ఉర్రూతలూగిస్తున్నారు. అమిత్ షా కూడా వరుస సమావేశాలతో పార్టీని, కార్యకర్తలను, ప్రజలను ఆకర్షిస్తున్నారు. అటు ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. బీజేపీ, జనసేన కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇలా ప్రధాన నేతలంతా రంగంలోకి దిగడంతో ప్రచార పర్వం మరింత వేడెక్కింది.అటు తెలంగాణ నవంబర్ 15తో నామినేషన్ల పర్వం ముగిసినసంగతి తెలిసిందే. నవంబర్ 30 పోలింగ్ , డిసెబర్ 3న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెల్లడికానున్నాయి.
36 వేల ఈవీఎంలు రెడీ
Published By Voice Today Team
243
- Advertisement -
- Advertisement -
- Tags
- assembly elections
- chief election commissioner
- earned value
- earned value analysis
- earned value calculation
- earned value management
- earned value management basics
- earned value management definition
- earned value management evm
- earned value management in project management
- earned value management is
- earned value management overview
- earned value management technique
- earned value management tutorial
- earned value project management
- election
- election 2022
- election breaking
- Election commission
- election commission gets ready for 'evm challenge'
- election commission of india
- Elections
- elections 2019
- elections explained
- evm
- evm project management
- general elections
- gujarat elections
- indian elections
- karnataka elections
- local body elections
- lok sabha election 2019
- lok sabha elections
- lok sabha elections 2019
- mike clayton
- onlinepmcourses
- pmu5
- third phase of elections in up
- up elections 2022



