శ్రీకాకుళం జిల్లాలో పలు కేసులలో 4 కోట్ల ప్రాపర్టీ రికవరీ.
గంజాయి మూలాలు పై ఉక్కుపాదం.
ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్న పోలీసు వ్యవస్థ.
4 crore property recovered in various cases in Srikakulam district: State Home Minister Vangalapudi Anitha
రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత.
: విశాఖపట్నం రేంజ్ పరిధిలో బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపు
శ్రీకాకుళం జిల్లాలో ప్రాపర్టీ నేరాలు పెరిగినప్పటికీ అందుకు అనుగుణంగా నేరాలు ఛేదించడం కూడా పూర్తిస్థాయిలో జరిగిందని శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి నాలుగు కోట్ల మేరకు కేసుల ప్రాపర్టీని చేదించి సదురు కేసులలో నిందితులగా ఉన్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం పటిష్టంగా పనిచేయడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగి పోలీస్ ప్రతిష్ట పెరిగిందన్నారు.పాడేరు , మన్యం వంటి చోట్ల గంజాయి సాగుని నివారించామని, గంజాయి క్రయ ,విక్రయాలు అక్రమ రవాణా చేసిన వారితో పాటు వ్యవసాయం చేసిన వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని రేంజ్ పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ఈగల్ టీం లను ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల కేసులలో మూలాలు కనుక్కొని,ఆస్తులు జప్తు చేస్తున్నామని, విశాఖపట్నం రేంజ్ పరిధిలో మూడు కేసులలో ఆస్తులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయి సాగు చేసిన, స్మగ్లింగ్ చేసిన , కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నాం అని అన్నారు.పాక్సో కేసులలో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నాం.డ్రోన్ , సీసీ కెమెరాలు ఉపయోగిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నాం. సంకల్పం కార్యక్రమంలో మహిళలు బాలికలు భద్రతతో పాటు, గంజాయి నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు అన్నారు. పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ,
యాక్టివ్ రౌడీ షీటర్ ల పై నిఘా ఉంచామన్నారు ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాల,వసతి గృహాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, శక్తి బృందాలు ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తుల ఫిర్యాదు మేరకు వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి నైపుణ్యం గల ఔట్సోర్సింగ్ యువతను నియమించి పెండింగ్లో ఉన్న సైబర్ కేసులన్నీ పరిష్కరించి బ్యాంకు అధికారుల సహకారంతో బాధితులు నగదును తిరిగి రిఫండ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని,నేరం జరిగిన వెంటనే స్పందించడంతో పాటు, 24 నుంచి 48 గంటల్లో కేసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు.మీడియా సహకారం, ప్రజల స్పందన వల్లే ఇది సాధ్యమవుతోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని మతాలకు, అన్ని కులాలకు సమానంగా వ్యవహరిస్తోంది. ఎవరి మాటలకైనా భయపడి చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకండి.చట్టం ముందు అందరూ సమానమే అని మంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి తో పాటు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ,శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ,విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం జిల్లా ఏఎస్పి అంకిత సురాన పాల్గొన్నారు.