- Advertisement -
కుక్కల కాటుకు 40మందికి గాయాలు
40 people were injured due to dog bitesకర్నూలు
కర్నూలు ఓల్డ్ టౌన్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి.సుమారు 40 మందిపై దాడి చేసి గాయపరిచాయి.గాయపడిన వారిని స్థానికులు వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను అప్రమత్తం చేసి ఆసుపత్రికి వెళ్లారు.
బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితులకు కర్నూలు నగరపాలక సంస్థ తరఫున రూ. 10 వేలు అందిస్తామని ప్రకటించారు.వీధి కుక్కల సమస్యకు సంబంధించి కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు
- Advertisement -




