బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

- Advertisement -

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్. రాంచందర్‌రావు, డాక్టర్‌ కె. లక్ష్మణ్‌

BJP OBC Morcha State Executive Meeting

హైదరాబాద్‌, ఆగస్టు 17 (వాయిస్ టుడే):
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ఓబీసీ మోర్చా కార్యక్రమాల విస్తరణ, భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలపై నాయకులు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సంస్థాగతంగా ఓబీసీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, బీసీ వర్గాల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని నాయకులు వివరించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular