బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 44 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఏడంతస్తుల రెస్టారెంట్ భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్లో ఉన్న 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
ఢాకాలోని 7 అంతస్తుల రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం ఇక్కడికి వచ్చాం. ఫైర్ సిబ్బంది వేగంగా మంటలు ఆర్పారు. వేసవి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అప్పటికే 44 మంది దుర్మరణం చెందారు. 75 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాం. 40 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించాం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.” అని పోలీసులు తెలిపారు.