Thursday, April 24, 2025

 టెన్త్ క్లాస్  ప్రియుడి కోసం 45 ఏళ్ల మహిళ దుర్మార్గం

- Advertisement -

 టెన్త్ క్లాస్  ప్రియుడి కోసం 45 ఏళ్ల మహిళ దుర్మార్గం
హైదరాబాద్, ఏప్రిల్ 2

45-year-old woman commits adultery for 10th grade boyfriend

అమీన్‌పూర్‌ పిల్లల మృతి కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్ అని గుర్తించారు. విషం పెట్టి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను తల్లే పాశవికంగా అంతమొందించినట్లు తేల్చారు. వివాహేతర సంబంధం మోజులో ముగ్గురు పిల్లలను హత్య చేసిందని నిర్ధారించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని..  తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో నిజం బయటపడటంతో తల్లి రజితను అరెస్ట్ చేశారు. భర్తను కూడా చంపాలని ఆమె డిసైడయ్యింది. అయితే అతను పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన చాలా సంచలనం సృష్టించింది.  ముందుగా భర్తను అనుమానించారు పోలీసులు. లోతైన దర్యాప్తు తర్వాత భార్య రజిత బాగోతం బయటపడింది. కొన్నాళ్ల క్రితం రజిత టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ గెట్‌ టుగెదర్‌కు వెళ్లింది. అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారనే కారణంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేసింది. మార్చి 27 శుక్రవారం రాత్రి పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి తినిపించింది. భర్త చెన్నయ్య ఆరోజు పెరుగు తినకుండా భోజనం ముగించాడు. తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవింగ్ పనిపై బయటకు వెళ్లిపోయాడు. తిరిగొచ్చాక చూస్తే పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.  12 ఏళ్ల సాయికృష్ణ, 10 ఏళ్ల మధు ప్రియ, 8 ఏళ్ల గౌతమ్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది.ఎందుకిలా జరిగిందో తనకు తెలియదని, తాను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యానని రజిత చెప్పడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు భర్త. చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన ఘోరం బయటపడింది. రజితతోపాటు ఆమె ప్రియుడూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు.  వివాహేతర సంబంధం మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చంపుకోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్