Sunday, September 8, 2024

టీఎస్పీఎస్సీలో 5 తప్పులు

- Advertisement -

టీఎస్పీఎస్సీలో 5 తప్పులు
హైదరాబాద్, జూలై 8,
తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం (జులై 7) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీ ని కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ కీలో కొన్ని తప్పులు దొర్లాయని గ్రూప్‌-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో వచ్చిన ఈ తప్పులను సరిచేయకుండా.. వాటిని టీజీపీఎస్సీ అధికారులు అలాగే ఇచ్చినట్లు అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఐదు తప్పులు దొర్లాయని, వాటిని టీజీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని దేవేందర్‌, రాకేశ్‌ తదితర గ్రూప్‌ 1 అభ్యర్ధులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే కమిషన్‌ ఫైనల్‌ కీలో 2 ప్రశ్నల తొలగించింది. మరో ప్రశ్నకు రెండు ఆప్షన్లు కూడా కరెక్టుగా ఉండటంతో పరిగణనలోకి తీసుకున్నామని చెప్పింది.రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్‌ 9న 31 జిల్లాల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. దీని ప్రకారం మొత్తం 28,150 మందికే మెయిన్స్‌ రాసే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి షార్ట్‌ఫాల్‌ విధానం అమలు చేయడంతో మెయిన్స్‌కు హాజరయ్యేవారి సంఖ్య 31,382 మందికి పెరిగింది. అదనంగా 3,232 మందిని ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్‌ మార్కుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్‌ 1 మెయిన్ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, గతంలో ప్రకటించిన విధంగానే మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మెయిన్స్‌ పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది.
ఏమిటీ షార్ట్‌ఫాల్‌ విధానం..?
గ్రూప్‌-1లో ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు షార్ట్‌ఫాల్‌ విధానాన్ని టీజీపీఎస్సీ ఈసారి కొత్తగా అమలు చేసింది. తొలుత చెప్పిన విధంగా 1:50 చొప్పున 563 పోస్టులకు మెరిట్‌ జాబితాలో 28,150 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్‌కు ఎంపిక కావల్సి ఉంటుంది. అయితే మెరిట్‌ జాబితా ప్రకారం కమ్యూనిటీ రిజర్వేషన్‌ పోస్టుల్లో 1:50 నిష్పత్తికి తక్కువగా ఉంటే అదనంగా అదే కమ్యూనిటీ నుంచి ఎంపిక చేసే విధానానే షార్ట్‌ఫాల్‌ అంటారు. ఎస్సీ క్యాటగిరీలో 70 పోస్టులుంటే.. వారందరినీ 1:50 నిష్ప త్తి ప్రకారం లెక్కిస్తారు. తద్వారా 3,500 మంది ఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసి, మెయిన్స్‌కు రాసేందుకు అర్హత కల్పిస్తారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్