- Advertisement -
మృతుని కుటుంబానికి 5000చేసిన రేల కుమార్ స్వామి.
5000 to the family of the deceased Rela Kumar Swamy.
కమాన్ పూర్
మృతుని కుటుంబానికి 5000 రూపాయలను ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా శనివారం రేండ్ల కుమార స్వామి అందజేశారు.
రామగిరి మండలం కల్వచర్ల గ్రామ నివాసి శతాధిక 106 సంవత్సరాల వృద్ధుడు (మేదరి) ఎనమనగండ్ల రాములు శుక్రవారం రాత్రి పరమపదించారని తెలియగానే రేండ్ల శారద కుమారస్వామి వారి పార్థివదేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేయడం జరిగింది. అనంతరం వారు మన ఊరిలో చేసిన సేవలు అమోఘం. వారి జీవితం నుండి చాలా నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి, వారికున్న దేవుని పట్ల భక్తి భావం, రామాయణ, మహాభారత, భాగవతం సంబంధించిన విషయాలలో, మన సంప్రదాయాల విషయంలో, జానపదం, పాటలలో వారికున్న జ్ఞానం అమోఘం అని కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులకి అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలు అందజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్నీ ప్రార్ధించారు
- Advertisement -



