Wednesday, January 22, 2025

55 కోట్లు లెక్క గట్టిగా పట్టుకుంటోంది…

- Advertisement -

55 కోట్లు లెక్క గట్టిగా పట్టుకుంటోంది…

55 crores figure is holding tight...

హైదరాబాద్, డిసెంబర్ 19, (వాయిస్ టుడే)
దమ్ముంటే అరెస్ట్ చేస్తే చేస్కోండి.. ఏమవుతుంది.. జైలుకెళ్లి యోగా చేసి స్లిమ్ అవుతా, ఫిట్ అయి వస్తా, పాదయాత్ర చేస్తా అంటున్నారు కేటీఆర్, నిజానికి ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా మనీ ట్రాన్స్ ఫర్ చేయడం తప్పు అని మాజీ మంత్రికి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఫార్ములా ఈ రేస్ లో అధికారులది ఏం తప్పు లేదు అంతా నాదే బాధ్యత అంటున్నారు. అంతే తప్ప అందులో ఎలాంటి తప్పు లేదని మాత్రం అంతే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.అప్పుడు నేనే గవర్నమెంట్, సంతకం పెట్టా.. పైసల్ రిలీజ్ చేయించా.. అయితే ఏంటి అని కేటీఆర్ ఎదురుప్రశ్నిస్తున్నారు. నిజానికి ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో తప్పులు కచ్చితంగా జరిగాయి అని ఇప్పటికే చాలా మందికి అర్థమైంది. ఎందుకంటే ఆఘమేఘాల మీద ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ ను సంప్రదించకుండా, పైగా ఎన్నికల కోడ్ ఉండగా, 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించారు. ఇందులో దాచడానికి ఏముందంటున్న కేటీఆర్.. ఇంత అర్జంట్ గా అదీ ఎన్నికల కోడ్ ఉండగా, ఆర్బీఐ, క్యాబినెట్ అనుమతి లేకుండా ఎందుకలా చేశావ్.. ఒక్కడివే మీదికి ఎందుకు తెచ్చుకున్నావ్ అంటే అట్నుంచి ఆన్సర్ లేదు.నిజానికి బయటి దేశపు సంస్థ, కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ట్యాక్స్ చెల్లించి పంపినా అందులో జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. ఈ విషయంలో అసలు ఏం జరిగిందన్నది బయటకు తేవాలనుకుంటోంది ప్రభుత్వం. అందుకే ఏసీబీ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది. తాజాగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందులో మతలబులు ఏం జరిగాయో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయట పెట్టేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా కేటీఆర్ సీన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ చూస్తుంటే అర్జంటుగా జైలుకు వెళ్లాలన్న తాపత్రయమే కనిపిస్తోందన్నది చూసే వారెవరికైనా అర్థమయ్యే విషయమే. ఎందుకోసం ఈ ఆరాటం అన్న ప్రశ్నలకు రకరకాల ఆన్సర్లు వస్తున్నాయిఫార్ములా ఈ రేసింగ్ పై క్యాబినెట్ అనుమతి లేదు, ఒప్పందాలు లేవు.. సింపుల్ గా నిధులను సింగిల్ సిగ్నేచర్ తో FEOకి ఇచ్చి పడేశారు కేటీఆర్. కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఆ సొత్తును ఆర్బీఐ అనుమతి లేకుండానే 9 కోట్ల టాక్స్ తో ఎఫ్ఈవో కి చెల్లించడం చట్ట విరుద్దం అని ప్రభుత్వం అంటోంది. ఎవరో నష్ట పోయారని అందుకు తెలంగాణ సందనను దోచిపెట్టడం ఏంటని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేసింగ్ ను రద్దు చేస్తే.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పరువు పోయిందని, 700 కోట్లు నష్టమన్న వాదనను కేటీఆర్ వినిపించుకొచ్చారు.నిజానికి 2024 ఫిబ్రవరి 10న జరగాల్సిన రేస్ జరగకపోడంతో హెచ్ఎండీఏను సుమారు 200 కోట్ల నష్టాల బారి నుంచి తప్పించింది కాంగ్రెస్ సర్కార్. అయితే HMDA ఇండిపెండెంట్ బోర్డు అని, తాను వైస్ ఛైర్మన్ అని చెబుతూ.., ఎవరి అనుమతీ అక్కర్లేదంటూనే.., అరెస్ట్ గురించి కేటీఆర్ ఎందుకంత భయపడుతున్నారన్నదే అసలు పాయింట్.డిసెంబర్ 16న క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇదే మ్యాటర్ పై మంత్రుల అభిప్రాయాన్ని కూడా సీఎం తెలుసుకున్నారు. ఈ కేసులో ఎక్కడా తప్పులకు ఆస్కారం లేకుండా, అన్నీ చట్టానికి లోబడి, చట్ట ప్రకారంగానే ముందుకెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.అంతే కాదు.. ఇటీవలే సీఎం బర్త్ డే సందర్భంగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని, కావాలంటే కేక్ కట్ చేయించి.. చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇచ్చి పంపుతానన్నారు. సో లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే.. ఏ క్షణమైనా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ‌కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎలాంటి ఎంక్వైరీకైనా రెడీ అని కేటీఆర్ అంటుంటే.. ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారుతోంది.మరోవైపు కేటీఆర్ చేసింది పెద్ద తప్పు అని, ఆయన జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. కేటీఆర్ ఏడేళ్ల దాకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని, ఆయన చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదంటూ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదని గుర్తు చేస్తున్నారు.ఓవైపు అరెస్ట్ చేస్తే చేస్కోండని కేటీఆర్ అంటుంటే.. ఇంకోవైపు బీఆర్ఎస్ లీడర్లు మాత్రం రాష్ట్రం అగ్ని గుండమే అని వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈ రెండింటికీ అసలు మ్యాచ్ అవుతుందా అన్నది హస్తం నేతల ప్రశ్న. తప్పు చేస్తే చిన్నోళ్లైనా, పెద్దోళ్లైనా చట్టం అందరికీ సమానమే ఇప్పటికే రేవంత్ సర్కార్ స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపింది. అలాంటిది ఆధారాలతో సహా తప్పులు తేలితే వదిలిపెడుతుందనుకోవడం పొరపాటే.విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంకోవైపు ఫార్ములా ఈ రేస్ మనీ ట్రాన్సాక్షన్ ఇష్యూలో కేటీఆర్ కూడా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఇష్యూస్ లో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ కేసీఆర్ కరెంట్ డీలింగ్స్ పై జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన రిపోర్ట్, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్యుత్ పై వైట్ పేపర్ డిటైల్స్ చెక్ చేద్దాం. విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై కమిషన్ అక్టోబర్ లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది.అయితే దాన్ని రేవంత్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. కమిషన్ ఫైండింగ్స్ పై అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చించి.. ఫైనల్ అవుట్ పుట్ తీసుకున్నాకే చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. సో ఇప్పుడు ఆ టైం వచ్చేసిందంటున్నారు. తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది కూడా. కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, తాము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది సభలోనే ప్రకటించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందికేసీఆర్‌ హయాంలో పదేళ్లపాటు చేసుకున్న కరెంట్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ కమిషన్‌ రిపోర్ట్ ను తెలంగాణ క్యాబినెట్ డిసెంబర్ 16న ఆమోదించింది. నివేదికపై సభలో చర్చించిన తర్వాతే మాజీ సీఎం కేసీఆర్‌పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయాలనుకుంటోంది ప్రభుత్వం. దీని ఆధారంగా కేసీఆర్‌ సహా పలువురిపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో కేసీఆర్‌ డిస్కమ్‌లను ఆర్థికంగా కుప్పకూల్చారని, మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, కరెంట్ కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో 25 ఏళ్లపాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని శ్వేతపత్రం తేల్చింది.కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9 వేల కోట్ల దాకా జనంపై భారం పడనుందంటున్నారు. నిజానికి ఎవరైనా అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్లు కడుతారు. ఇప్పుడు సూపర్ క్రిటికల్, అల్ట్రా క్రిటికల్, అడ్వాన్స్ డ్ అల్ట్రా క్రిటికల్ టెక్నాలజీ అని వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం వద్దని చెప్పినా పాత టెక్నాలజీకే మొగ్గు చూపారు. అటు ఛత్తీస్ గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం, యూనిట్‌ ఏడు రూపాయలకు కొనాల్సిన పరిస్థితి రావడం, 1000 మెగావాట్ల కరెంట్‌ను తీసుకోవడానికి ఛత్తీస్ గఢ్‌తో ఒప్పందం చేసుకున్నా అది రాకపోవడం, బయట కొనడంతో 2 వేల కోట్ల అదనపు భారం పడడం ఇవన్నీ చర్చకు వస్తున్నాయివెయ్యి మెగావాట్ల తరలింపునకు పవర్‌ గ్రిడ్‌తో కారిడార్‌ బుక్‌ చేసుకుని, ఆ మేరకు తరలించకపోవడంతో 635 కోట్లు చార్జీలు కట్టి నష్టపోయిన పరిస్థితి. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్లు పెనాల్టీ నోటీసు అందుకోవడం అలాగే బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మించడం, బొగ్గు రవాణాకే ఎక్కువ ఖర్చు చేయడం ఇవన్నిటిపై క్యాబినెట్ చర్చించింది. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ పై కథ చాలా దూరం వెళ్లిందంటున్నారు. నిజానికి దమ్ముంటే విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుకోండి అని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసిరారు. దీంతో ప్రభుత్వం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది.ఒక దశలో కమిషన్ నే రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీందాకా వెళ్లారు. అయితే కోర్టు మాత్రం కమిషన్ ఛైర్మన్ ను మార్చాలనడంతో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జులై 29న మదన్ బి లోకూర్ కమిషన్ ఛైర్మన్ గా నియమించింది. దీంతో కమిషన్ బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయాలు స్వీకరించింది. అఫిడవిట్ల రూపంలో వివరాలు అందించిన వారిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కూడా చేసింది. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులేంటో చాలా మంది కమిషన్ ముందు వివరించారు. నవంబర్ లో ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. సో దీనిపై కరెంట్ బాంబ్ ఏదో ఒక సమయంలో పేలడం ఖాయమే అని అంటున్నారు.ఓవైపు విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ మదన్ బి లోకూర్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందడం, దాన్ని క్యాబినెట్ ఆమోదించడం, అసెంబ్లీలో పెట్టి చర్చించి చట్ట ప్రకారం ముందుకెళ్లే విషయంపై స్పీడ్ పెరుగుతున్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అమెరికా ప్రయాణం పెట్టుకుంటున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటన్నది త్వరలోనే క్లారిటీ రాబోతోంది. అటు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటన్నది కూడా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్