కేంద్ర ప్రభుత్వ స్కీమ్ గురించి మీకు తెలుసా?…గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..ఎలా అంటే?*
గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
తొలి కాన్పుకు అయితే ఐదు వేలు,
రెండో కాన్పుకు అయితే ఆరు వేలు
చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా అందిస్తోంది.
ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు.
ఈ పథకం పేరు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన( PMMVY).
ఈ పథకంలో భాంగా తొలిసారి గర్భం దాల్చే మహిళలకు ఐదు వేలు, రెండోసారి ప్రసవంలో ఆడ పిల్ల పుడితే ఆరు వేలు రూపాయలు సాయాన్ని అందిస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా ఎవరు లబ్ధి పొందవచ్చు,
ఎలా దరఖాస్తు చేయాలి? వంటి అంశాలు మీకోసం అందిస్తున్నాం.
ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన
గర్భం దాల్చిన మహిళలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా గర్బం దాల్చిన వెంటనే మహిళలు తమ పరిధిలోని ఆశా వర్కర్/ఏఎన్‌ఎం ద్వారా ఈ స్కీమ్‌కు సంబంధించిన పోర్టల్‌లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. తొలిసారి గర్భం దాల్చినట్టు అయితే ఐదు వేలు అందిస్తారు. ఈ పోర్టల్ పేరు నమోదు చేసుకున్న వారికి తొలి విడతలో గర్భం దాల్చిన ఆరు నెలల్లో మూడు వేల రూపాయలు నేరుగా లబ్ధిదారు అకౌంట్‌లో జమ అవుతుంది. రెండో విడతలో డెలివరీ తరువాత 14 వారాల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మిగిలిన రెండు వేలు రూపాయలు అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా అందించే ఆర్థిక సాయాన్ని ఏడాది కిందట వరకు మూడు విడతల్లో చెల్లించేవారు. కానీ, గతేడాది నుంచి రెండు విడతలకు కుదించారు. ప్రస్తుతం రెండు విడతల్లో తొలి గర్భం దాల్చిన లబ్ధిదారులకు నేరుగా అకౌంట్‌కు జమ చేస్తున్నారు.
రెండోసారి అమ్మాయి పుడితే ఆరు వేలు
ఈ పథకంలో భాగంగా మూడేళ్ల కిందటి వరకు తొలి ప్రసవానికి మాత్రమే ఐదు వేలు అందించేవారు. కానీ, మూడేళ్ల నుంచి రెండోసారి గర్భం దాల్చిన బాలికకకు ప్రసవించే మహిళలకు ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. రెండోసారి బాలికకు జన్మనిస్తే వారు ఏఎన్‌ఎం/ఆశా ద్వారా మరోసారి పీఎంఎంవీవైఎంఐఎస్( PMMVY MIS ) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 14 వారాల వ్యాక్సినేషన్ పూర్తయిన తరువాత ఆరు వేలు ఒకేసారి లబ్ధిదారు అకౌంట్‌లో జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ప్రసవం జరిగినా ఈ సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు చేయాల్సిందంతా రిజిస్ర్టేషన్ చేసుకోవడమే.
ఈ అర్హతలు తప్పనిసరి
ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే సాయం పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. గర్భం దాల్చిన మహిళ వయసు 18 ఏళ్లు దాటాలి. ఏడాదికి ఎనిమిది లక్షలు కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండకూడదు. మాతృ శిశు సంరక్షణ కార్డు గానీ, రేషన్‌కార్డు/ఆధార్‌కార్డు గానీ, కిసాన్‌కార్డు గానీ, ఈ శ్రమ కార్డుగానీ, ఆయుష్మాన్ భారత్ కార్డుగానీ ఉండాలి. రెండో ప్రసవంలో బాలిక పుడితే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్‌ను సమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఈ రెండు కాన్పులకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవడానికి దగ్గరలోని ఆశా కార్యకర్తనుగానీ, ఏఎన్‌ఎంగానీ సంప్రదించాల్సి ఉంటటుంది.