- Advertisement -
పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయిచింది. పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపట్టనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందన్నారు.
- Advertisement -