- Advertisement -
నవంబర్ లో 89 లక్షల ప్రాపర్టీ రికవరీ
89 lakh property recovery in November
విశాఖపట్నం
గడచిన నెలలో విశాఖ పరిధిలో 89 లక్షల 33 వేల 385 ప్రాపర్టీ రికవరీ చేశామని విశాఖ సీపీ సంకబ్రతా భాగ్చి తెలిపారు.73 కేసుల్లో 87 మందిని అరెస్ట్ జైలుకు పంపించామని,బంగారం 1106 గ్రాములు,4616 గ్రాముల వెండి 3 లక్షల 50 వేల 820 రూపాయలు నగదు,ఒక ఆటో ఒక కారు రెండు ల్యాప్టాఫ్ లు 21 ద్విచక్ర వాహనా లు ఒక ప్రింటర్ స్వాధీనం చేసు కున్నామని తెలిపారు.జులై నుండి ఇప్పటి వరకు 8 వేల సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు నిఘా నీడలో దొంగతనం జరిగిన కొద్దీ రోజుల్లో దొంగను పట్టుకుని కేసును చేదిస్తు న్నామని,నేరం జరిగిన వెంటనే కేసును పరిగణలోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.జాయ్ జమిమా కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని,బాధితుల తరపున చాలామంది ముందుకు వస్తున్నారని,కొంతమంది రాజకీయ నేతల పాత్ర వున్నట్లుగా తెలుస్తోం దని,ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పిర్యాదు చేస్తే వారి వివరాల ను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
- Advertisement -