8వరోజు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము “మీకోసం మీ వేనిగండ్ల”ఉదయపు పర్యటన

- Advertisement -

8వరోజు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము “మీకోసం మీ వేనిగండ్ల”ఉదయపు పర్యటన

8th Day Gudivada MLA Venigandla Ramu "Mineparach Me Venigandla" morning tour

ద్విచక్ర వాహనంపై ప్రధాన రహదారుల్లో పర్యటించిన ఎమ్మెల్యే
క్షేత్రస్థాయిలో శానిటేషన్ సమస్యలపై..మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము
గుడివాడ డిసెంబర్ 11:
గుడివాడ మనది అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని అప్పుడే స్వచ్ఛ గుడివాడ రూపకల్పన సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.  గుడివాడ పట్టణంలో పారిశుధ్య మెరుగుకు… ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహిస్తున్న “మీకోసం మీ వెనిగండ్ల” ఉదయపు పర్యటనలు 8వ రోజుకు చేరుకున్నాయి.  బుధవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే రాము.. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల త్రాగునీటి పైపుల లీకేజీలను గుర్తించిన ఎమ్మెల్యే రాము… వాటికి మరమ్మతులు నిర్వహించాలంటూ మున్సిపల్ అధికారులకు సూచించారు. పలు ప్రాంతాల్లో విధులు నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు… క్షేత్రస్థాయిలో శానిటేషన్ మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధి, పారిశుధ్య మెరుగు కోసం ఉదయపు పర్యటనలు నిర్వహిస్తున్నానని  పేర్కొన్నారు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఎంత కష్టపడిన ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఇక ఉపేక్షించేది లేదని పారిశుధ్య సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానాలు  విధిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము హెచ్చరించారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు  పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular