- Advertisement -
మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు!
హైదరాబాద్: తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్ సింగ్ తనను వేధిస్తున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
”కిషన్‌సింగ్.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాను” అని మహిళా ఉద్యోగి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్‌సింగ్ పరిచయమైనట్లు ఆ మహిళ తెలిపారు..
- Advertisement -



