దళిత కుటుంబాలకు బిజెపి ఎప్పుడు అండగా ఉంటుంది ఈటల రాజేందర్
భూమి కేసీఆర్ నియబ్బ జాగిరా అంటూ ఫైర్ అయినా ఈటెల
రంగా రెడ్డి జిల్లా: హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న బడంగ్ పేటకు చెందిన దళితులను బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు, బడంగ్పేట్ లో ఉన్న సర్వే నంబర్ 2లో ల్యాండ్ లో గత 70 సంవత్సరాలుగా సుమారు 300 దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ 40 ఎకరాలలో సాగు చేస్తూ ఉండగా దానిలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు లాక్కుని మిగిలిన భూమిని కూడా లాక్కుంటామని బెదిరిస్తూ ఉండడంతో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అరెస్టు చేసిన పోలీసులు. వారిని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు, దీనితో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, బిజెపి నాయకులకి పోలీస్ లకి తోపులాట జరిగింది,అదే సమయంలోba
పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఈటెల రాజేందర్ దళితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ దళిత కుటుంబ సభ్యుల జోలికొస్తే బిజెపి పార్టీ అండగా ఉంటుందని, ఇక్కడ ఉన్న భూమి కేసీఆర్ నియబ్బ జాగిరా అంటూ ఫైర్ అయ్యారు ఈటెల, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు దళితుల దగ్గర నుంచి భూములు లాక్కునే బ్రోకర్ లాగా మారిపోయాడు,రియల్ ఎస్టేట్ మాఫియా లాగా మారిపోయాడు అని అన్నారు,దళిత జాతి మొత్తం ఆ ఊరికి అండగా వుంటుంది అని నీ సంగతి ఏంటో తెలుస్తం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్



