ప్రేమ-పెళ్లి కి తల్లిదండ్రుల అనుమతి..!

- Advertisement -

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 

గుజరాత్ – ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.  పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Parents' permission for love-marriage..!
Parents’ permission for love-marriage..!
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular